Monday, December 23, 2024

వేధింపులు నిజమే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మెడికో ప్రీతిని టార్గెట్ చేసి సీనియర్ సైఫ్ వేదిలపులకు గురి చేసినట్టుగా తేలిందని వరంగల్ సిపి రంగనాథ్ చెప్పారు. మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో సైఫ్‌ను అరెస్ట్ చేశామని తెలిపారు. శుక్రవారం వరంగల్ లోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిందితుడిపై పలు సెక్షన్లపై కేసులు నమోదు చేసినట్టుగా చెప్పారు. సైఫ్ మెడికో ప్రీతిని వేధించినట్టుగా ఆధారాలు లభ్యమయ్యాయన్నారు. వాట్సాప్ గ్రూపులో మేసేజ్ పెట్టి డాక్టర్ ప్రీతిని వేధించినట్టుగా గుర్తించామని ఆయన తెలిపారు. వాట్సాప్ గ్రూపులో మేసేజ్ పెట్టి అవమానించడం ర్యాగింగ్ కిందకే వస్తుందని వివరించారు. గ్రూపుల్లో మేసేజ్‌లు పెట్టి తనను అవమానిం చవద్దని సైఫ్‌నకు పర్సనల్ మేసేజ్ పెట్టి ప్రీతి వేడుకుందని తెలిపారు. తాను ఏదైనా తప్పు చేస్తే తన హెచ్‌ఒడికి ఫిర్యాదు చేయాలని మెడికో ప్రీతి చెప్పిందన్నారు.

ప్రీతిపై సైఫ్ ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేసినట్టుగా విచారణలో తేలిందని వివరించారు. గత నాలుగు మాసాలుగా సైఫ్ ను వేధింపులకు గురి చేసినట్టుగా తాము గుర్తించినట్టుగా వివరించారు. మెడికో ప్రీతికి సహకరించవద్దని తన సహచరులకు సైఫ్ వాట్సాప్ ద్వారా మేసేజ్ లు పంపాడని తాము గుర్తించామని చెప్పారు. ఈ నెల 20వ తేదీన సైఫ్ వేధింపుల గురించి ప్రీతి తన పేరేంట్స్ కు చెప్పిందని తెలిపారు. ఈ నెల 21న ప్రీతి, సైఫ్ లకు కాలేజీ యాజమాన్యం కౌన్సిలింగ్ ఇచ్చారని చెప్పారు. పాయిజన్ ఇంజక్షన్ ఏముందనే విషయమై ప్రీతి గూగుల్ లో వెతికినట్టుగా తాము గుర్తించినట్టుగా తెలిపారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 22వ తేదీన ప్రీతి ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నామని చెప్పారు. ఈ విషయమై టాక్సాలజీ రిపోర్టు వస్తే ప్రీతి ఆరోగ్యం క్షీణించడానికి కారణాలు తేలుతాయన్నారు. ప్రీతి కేసు విషయంలో పోలీసుల నుండి ఎలాంటి నిర్లక్ష్యం లేదని ఆయన స్పష్టం చేశారు.

మరో వైపు ఈ కేసులో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు. ఈ కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించలేదని తేల్చి చెప్పారు. మెడికో ప్రీతికి అనారోగ్య సమస్యలున్నందున ఆమె ఏమైనా మెడిసిన్ తీసుకొని ఉండొచ్చని కాలేజీ వైద్యులు చెబుతున్నారన్నారు. అయితే టాక్సాలజీ రిపోర్టులో వాస్తవాలు తేలుతాయని ఆయన చెప్పారు. ఈ కేసు విషయమై సీనియర్లు, జూనియర్లను కూడా విచారిస్తామన్నారు. సైఫ్ కు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదన్నారు. ఘటన వెలుగులోకి రాగానే పోలీసులు రియాక్ట్ కాలేదన్నది అవాస్తవమన్నారు. ప్రీతి తండ్రిని అడిగితే పోలీస్ రియాక్ట్ అయ్యారని చెప్పారు. ర్యాగింగ్ అనేది ఇక్కడ చూడకూడదు.. బాసింగ్ అనేదే ఇక్కడ ప్రధానం. ఇంకా ఎంక్వైరీ చేస్తున్నామని తెలిపారు.

లైంగిక వేధింపులు లేవు –

ఈ ఘటనలో ‘పోలీస్ పరంగా ఎలాంటి నిర్లక్ధ్యం ఉన్నా ఊరుకోం. ఈ ఘటనలో ఎక్కడా లైంగిక వేధింపులు లేవు. ఈ కేసులో వాట్సప్ చాట్స్ కీలకంగా తీసుకున్నాం. సైఫ్ మాత్రం తను టార్గెట్ చేయట్లేదని, సబ్జెక్ట్ నేర్పించే ప్రయత్నం చేశానని చెప్పాడు.” అని చెప్పారు.

గవర్నర్ పూల దండ ఎందుకు తెచ్చారు?

మా అక్క ఏమైనా చనిపోయిందా?: తమిళిసై పై ప్రీతి సోదరి తీవ్ర ఆగ్రహం

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమె పరిస్థితి తెలుసుకోవడానికి స్వయంగా హాస్పిటల్ వెళ్లారు. అయితే, ఆమె వెంట పూల దండ కూడా తీసుకెళ్లారని దీప్తి సోదరి ఆరోపించారు. దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహించారు. ‘మా అక్క మరణించిందా? ఆమె చనిపోయిందని పూల దండ తెచ్చారా? గవర్నర్ తమిళిసై పూల దండ ఎందుకు తెచ్చారు?’ అని దీప్తి సోదరి ఆగ్రహంతో ప్రశ్నలు వేశారు. గవర్నర్‌గా ఆమె ఈ ఘటనపై ఓ కమిటీ వేయాల్సిందని, కానీ, అలా చేయకుండా ఆమె ఓ పూల దండ వెంట తీసుకు రావడం ఏమిటని అన్నారు.

హెచ్‌వోడీ నుంచి ప్రిన్సిపల్ వరకు అందరికీ ఫిర్యాదు చేశామని, కానీ, ఎవరూ సరైన రీతిలో విచారణ చేయట్లేదని అన్నారు. ఎస్‌టి అమ్మాయి కాబట్టే ఈ వివక్ష అంటూ ఆక్షేపించారు. ప్రీతికి అందిస్తున్న చికిత్సపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. ఎస్‌టి వర్గానికి చెందిన అమ్మాయి కాబట్టే చిన్నచూపు చూస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ ఇష్యూను డైవర్ట్ చేయడానికే ప్రీతిని వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తరలించారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News