Sunday, December 22, 2024

ఓఆర్‌ఆర్‌పై మెడికో ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెడిసిన్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా, సుల్తాన్‌పూర్ ఓఆర్‌ఆర్ రింగ్ రోడ్డుపై సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…బిహెచ్‌ఈఎల్, హెచ్‌ఐజికి చెందిన రచనారెడ్డి ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో పిజి చదువుతోంది. బాచుపల్లిలోని మమత మెడికల్ కాలేజీలో ఇంటర్న్ షిప్ చేస్తోంది. ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లా, సుల్తాన్‌పూర్ ఓఆర్‌ఆర్ రింగ్ రోడ్డుపై కారులో ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కొందరు అమీన్‌పూర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, రచనారెడ్డి ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News