సంగారెడ్డి: ఓఆర్‌ఆర్‌పై మెడికో రచనారెడ్డి ఆత్మహత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. కృష్ణారెడ్డి పేటలోని ఔటర్ రింగ్ రోడ్డులో మెడికో విద్యార్థి రచనారెడ్డి తన చేతికి మత్తు ఇంజెక్షన్ తీసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో పోలీసులు గుర్తించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం ఆమె కన్నుమూసింది. మెడికో మృతిపై అమీన్‌పూర్ సిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు రచనారెడ్డి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయలేదని పోలీసులు వెల్లడించారు. మెడికోది ఆత్మహత్యగా భావిస్తున్నామని అమీన్‌పూర్ సిఐ తెలిపారు. రచన కారులోని కొన్ని ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్యకు గల కారణం ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టులో తేలుతుందన్నారు. మెడికో మృతిపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
మా చెల్లి కొంతకాలంగా డిప్రెషన్‌లో ఉందని రచన సోదరుడు తెలిపాడు. చాలా సార్లు నచ్చజెప్పామని, తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారని తెలియజేశారు.