Monday, December 23, 2024

మెడికో విద్యార్థి ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

జన్నారంః జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన దాసరి హర్ష(22) అనే మెడికల్ ఫైనల్ విద్యార్థి శనివారం నిజామాబాద్‌లోని హస్టల్ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం జరగాల్సిన పరీక్షకు హాజరు కాకుండా ఆత్మహత్యకు పాల్పడడంతో చింతగూడ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. హాస్టల్‌లోని గదిలో తలుపుకు గడియ పెట్టుకొని బెడ్‌షీట్‌తో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందాడు.

హాస్టల్ గది తలుపులను ఎంతకు తీయక పోవడంతో స్థానిక పోలీసులు అక్కడకు చేరుకోని తలుపులను పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించి మెడికల్ కాలేజి అధికారులు తమ కుటుంబానికి సమాచారం ఇచ్చారు. చింతగూడ గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాస్, రాధలకు ఇద్దరు కుమారులు పెద్దకుమారుడు హర్ష , చిన్న కుమారుడు ధనుష్ , హర్ష కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్నాడని, కరీంనగర్, వరంగల్,  ఆసుపత్రులకు తిరిగిన వ్యాధి నయం కాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News