Saturday, December 28, 2024

మేడిగడ్డ బ్యారేజ్… ఒక పైసా ప్రజలపై భారం పడదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజ్ ఘటనపై మంత్రి కెటిఆర్ స్పందించారు. మేడిగడ్డ ప్రాజెక్టు కట్టి ఐదేళ్లు పూర్తయిందని, ప్రజలకు సంబంధించి ఒక్కపైసా కూడా వృథా కాదని, ప్రాజెక్టుకు సంబంధించి ప్రజలపై ఎలాంటి భారం పడదని చెప్పారు. ఒక్కపైసా భారం పడకుండా ఏజెన్సీనే పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు. 28 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని బ్యారేజ్ నిలబడిందని, ఇటీవల నేషనల్ డ్యామ్ సెఫ్టీ అథారిటీ బ్యారేజ్‌నీ పరిశీలించిందని, కాళేశ్వరం చివరి ఆయకట్టుకు నీళ్లు అందుతున్నాయని, ఎన్నికల సమయంలో పార్టీల విమర్శలు సరికాదని కెటిఆర్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News