మహదేవ్ పూర్/కాళేశ్వరం : అన్నారం బ్యారేజీ కంటే మేడిగడ్డ బ్యారేజీ అధికంగా నష్టపోయిందని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డిజిపి రాజీవ్ రతన్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి మహదేవ్‌పూర్ మండలం, కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర విజిలెన్స్ ఐజి పర్యటన రెండవ రోజు కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం మేడిగడ్డ కన్నెపల్లి పంప్ హౌస్‌ను క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ముందుగా కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకొని మోటార్లు, అక్కడ జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అన్నారం బ్యారేజీ వద్ద పిల్లర్లపై నడుస్తూ వెళ్లి బుంగలు పడ్డ పిల్లలను కెమికల్‌తో నింపిన ప్రదేశాలను పరిశీలించారు.
అక్కడ జరుగుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేడిగడ్డ మ్యారేజీ 21 పిల్లర్ కింద జరిగిన నష్టాన్ని పరీక్షించారు. పిల్లర్‌ను దగ్గరుండి పరిశీలించేందుకు ఎక్కడ కృంగింది అనే వివరాలు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… అన్నారం బ్యారేజీ కంటే మేడిగడ్డ బ్యారేజీ భారీగా నష్టం జరిగిందని తమ పరిశీలనలో తేలిందని అద్నరు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు సంబంధించిన రికార్డులు, హార్డ్ డిస్క్‌లను వారం రోజుల క్రితమే తమ బృందం స్వాధీనం చేసుకుందని చేసుకుందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే మళ్ళీ క్షేత్ర సహాయ పరిశీలనకు వచ్చామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను ప్రభుత్వానికి నివేదిక ద్వారా పంపిస్తామని తెలిపారు.