Sunday, November 17, 2024

కాసేపట్లో మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలించనున్న కేంద్ర బృందం

- Advertisement -
- Advertisement -

జయశంకర్‌భూపాలపల్లి: కాసేపట్లో మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు కేంద్ర బృందం రానుంది. మేడిగడ్డ బ్యారేజ్ వంతెన కుంగిన ఘటనపై ఆరుగురు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బ్యారేజ్‌ని అనిల్ జైన్ నేతృత్వంలోని కమిటీ పరిశీలించనుంది. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి పూర్తిగా నీటిని విడుదల చేశారు. బ్యారేజ్ ఎగువ నుంచి 22,500 క్యూసెక్కుల వరద నీటిని 57 గేట్లు తెరిచి దిగువనకు విడుదల చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 144 సెక్షన్ కొనసాగుతోంది. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లక్ష కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నాలుగు నాళ్ల ముచ్చటగా మారిందని నెటిజన్లు దుయ్యబడుతున్నారు. నిర్మాణంలో నాణ్యత లోపించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పెద్దపీఠ వేసిందని ప్రతిపక్షాలు, నెటిజన్లు ఆరోపణలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News