Monday, December 23, 2024

మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందం

- Advertisement -
- Advertisement -

జయశంకర్‌భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ ను కేంద్ర బృందం పరిశీలించింది. మేడిగడ్డ బ్యారేజ్ వంతెన కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు నిపుణులతో కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బ్యారేజ్‌ని అనిల్ జైన్ నేతృత్వంలోని కమిటీ పరిశీలిస్తుంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇంజినీరు వెంకటేశ్వర్లు, ఎల్ అండ్ టి అధికారులో అనిల్ జైన్ బృందం చర్చలు జరుపుతోంది. మేడిగడ్డ బ్యారేజీలో 15 నుంచి 20 పిల్లర్లు కుంగినట్టుగా గుర్తించారు. బ్లాక్ -7 వద్ద పిల్లర్లు కుంగిపోవడంతో శబ్ధం వచ్చిందని అధికారులు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిపివేశామని అధికారులు వెల్లడించారు. బ్యారేజీ పొడవు 1600 మీటర్లు ఉండగా 356 మీటర్లు కుంగిపోయిందని వెల్లడించారు. బ్యారేజీకి 85 గేట్లలో 67 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని వదిలామని అధికారులు తెలియజేశారు. మేడిగడ్డ బ్యారేజీ పూర్తిస్థాయి నీటి నిలువ 16 టిఎంసిలు కాగా ఇప్పటికే 10 టిఎంసిల నీటిని కిందకు వదిలారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News