Wednesday, January 22, 2025

కదిలిన గోదావరి..మేడిగడ్డ గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

ఎగువన నదీ పరివాహకంగా మహారాష్ట్ర చత్తిస్‌గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిలో వరద ప్రవాహం ప్రారంభమైంది.కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా గోదావరి నదిపై ఉన్న మేడిగడ్డ బ్యారేజిలోకి నీటి ప్రవాహం పెరుగుతూ వస్తోంది. ప్రాణహిత నదిద్వారా వరదనీరు గోదావరిలోకి చేరుకుంటోంది. దీంతో మేడిగడ్డ బ్యారేజి గేట్లు ఎత్తి ఉంచి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు వదిలిపెడుతున్నారు. మేడిగడ్డ బ్యారేజికి మొత్తం 85గేట్లు ఉన్నాయి. అందులో 84గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. గత ఏడాది చివరన బ్యారేజి కుంగిపోయిన ఘటనలో ఏడవ బ్లాకు దెబ్బతింది. ఈ బ్లాకు పరిధిలోని 20వ గేటు స్టక్చర్ పగుళ్లిచ్చుకుని భూమిలోకి పూర్తిగా కుంగిపోయి,

గేటువంకర్లు తిరగిపోవటంతో ఈ గేటును ఎత్తేందుకు ఏ మాత్రం సాధ్యపడలేదు.దీంతో ఈ గేటును మిషన్ ద్వారా కట్‌చేసి గేటు మొత్తాన్ని పూర్తిగా తొలగించారు. మేడిగడ్డ బ్యారేజికి తాత్కాలిక రిపేర్ల ప్రక్రియ చివరిదశకు చేరుకుంది. బ్యారేజి రక్షణ చర్యల్లో బాగంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీఇ నిపుణుల కమిటి ఆదేశాల మేరకు బ్యారేజి పగుళ్లను పూడ్చివేసేందుకు గ్రౌటింగ్, షీట్‌ఫైల్స్ వంటి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి బ్యారేజికి ఎగువన ,దిగువన చేపట్టిన సిసి బ్లాక్ రీ అరేంజ్‌మెంట్ పనులు చివరిదశలో చేరాయి.మట్టినమునాల కోసం డ్రిల్లింగ్ పని కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజిలోకి ఎగువ నుంచి 8వేల క్యూసెక్కుల వరదనీరు చేరుతుండగా, వచ్చిన నీటినంతా దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీరాంసాగర్‌కు 3524క్యూసెక్కులు:
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 3472క్యూసెక్కుల నీరు చేరుతోంది. రిజర్వాయర్‌నుంచి 465క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్‌లో నీటిమట్టం 1059.30అడుగులకు చేరగా, నీటినిలువ 9.91టిఎంసీలకు పెరిగింది. దిగువన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 3524క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టు నుంచి 545క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం 457.09 అడుగులకు చేరగా, నీటి నిలువ 4.23టిఎంసీలకు పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News