Monday, December 23, 2024

లక్ష్మీ, సరస్వతి బ్యారేజీ గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం వద్ద పుష్కర్‌ఘాట్ల పైనుంచి వరద ప్రవహిస్తోంది. ఉభయ నదులు 14.090 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నాయి. దీంతో గోదావరి నదిలో రెండో ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి నీరును కిందకు విడుదల చేశారు. మేడిగడ్డ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 14,44,470 క్యూసెక్కులుగా ఉంది. అన్నారం సరస్వతి బ్యారేజ్ 85 గేట్ల ద్వారా నీరును విడుదల చేశారు. సరస్వతి బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 6,62,163 క్యూసెక్కులుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News