Sunday, January 19, 2025

భారీ శబ్ధంతో కుంగిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌కు ప్రమాదం పొంచి ఉంది. బ్యారేజీ వంతెన రాత్రి కుంగిపోయింది. భారీ శబ్ధంతో 19, 20, 21 పిల్లర్ల వద్ద 30 మీటర్ల మేర వంతెన కుంగింది. అధికారులు వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. వంతెన కుంగడం వెనుక కుట్ర కోణం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యారేజ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 46 గేట్లు ఎత్తి బ్యారేజ్‌లోని నీళ్లను అధికారులు ఖాళీ చేస్తున్నారు. నాసిరకంగా నిర్మాణం చేయడంతోనే వంతెన కుంగిపోయిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read: వార ఫలాలు 22-10-2023 నుండి 28-10-2023 వరకు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News