Monday, January 20, 2025

మేడిగడ్డకు మరమ్మతులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ బ్యారేజి మరమ్మత్తు పనులు మొదలయ్యాయి. వర్షాకాలంలో మేడిగడ్డ బ్యారేజి దగ్గర చేపట్టాల్సిన రక్షణ చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫారసుల మేరకు ప నులు మొదలయ్యాయి. నిపుణుల కమిటీ చేసిన మధ్యంతర సూచనల మేరకు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ పనులు మొదలుపెట్టింది. బ్యారేజిలోని బ్లాక్ 7 లో 8 గేట్లను ఎత్తి వేసేందుకు చర్యలు చేపట్టింది. వరద ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని, అందు కు గేట్లను పూర్తిగా తెరచి ఉంచాలని ఎన్‌డీఎస్‌ఏ సిఫారసు చేసింది. నీటి ప్రవాహానికి ఆటంకంగా మారే అవకాశం ఉన్న ఇసుక మేటలు, రాళ్లను కూడా తొలగించాలని ఎన్‌డీఎస్‌ఏ కమిటీ ఆదేశించిన విషయం తెలిసిందే. సంబంధిత పనులను చేట్టాలని బ్యారేజీ నిర్మాణ ఏజెన్సీకి ఇరిగేషన్ శాఖ ఈమధ్యే ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో సదరు ఏజెన్సీ ఆ పనుల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.

మొత్తం 8 గేట్లలో ఇప్పటికే ఒక  గేటును విజయవంతంగా ఎత్తి పెట్టింది. మరో 2 గేట్లు మినహా మిగతా గేట్లను సైతం ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండానే ఎత్తే అవకాశముందని ఎల్ అండ్ టీ సంస్థ వెల్లడించింది. పగుళ్లు ఏర్పడిన 20 వ పిల్లర్, దాని పక్కన ఉన్న పిల్లర్ గేట్లను ఎత్తడంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని ఆ సంస్థ అభిప్రాయపడుతోంది. ఒకవేళ గేట్లను ఎత్తడం వీలు కాకపోతే, వాటిని పూర్తిగా తొలగించడానికి సైతం ప్రణాళికలను రూపొందిస్తోంది. అదే సమయంలో బ్యారేజికి దిగువన, ఎగువన పేరుకు పోయిన ఇసుక మేటలను తొలగిస్తోంది. ర్యాఫ్ట్ కింద ఉన్న రంధ్రాలను ఇసుక, సిమెంట్‌తో గ్రౌటింగ్ చేసేందుకు, షీట్ పైల్స్‌ను వేసేందుకు సైతం సమాయత్తం అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News