Monday, December 23, 2024

మేడిపల్లి ప్రీబిడ్ మీటింగ్ సక్సెస్.. అమ్మకానికి 85 ప్లాట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) రూపొందించిన మేడిపల్లి లే ఔట్ ప్లాట్ల కొనుగోళ్ల కోసం ప్రజలు ఉత్సాహాం చూపుతున్నారు. మేడిపల్లి లే ఔట్‌లో మంగళవారం హెచ్‌ఎండిఏ నిర్వహించిన ప్రీబిడ్ సమావేశానికి వంద మంది వరకు హాజరై ప్లాట్ల కొనుగోలుకు సంబంధించిన అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మేడిపల్లి లే ఔట్‌లో రెండోదశలో 85 ప్లాట్లను అన్‌లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్‌ఎండిఏ ప్రక్రియను ప్రారంభించింది.

మంగళవారం ప్రీ బిడ్ సమావేశానికి హెచ్‌ఎండిఏ సెక్రటరీ చంద్రయ్య, హెచ్‌ఎండిఏ ఎస్టేట్ ఆఫీసర్ (ఈఓ) కిషన్‌రావు, మేడిపల్లి తహసీల్దార్ మహిపాల్, హెచ్‌ఎండిఏ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గంగాధర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ హుస్సేన్‌లతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టిసి ప్రతినిధులు హాజరై మేడిపల్లి లే ఔట్ ప్రాధాన్యతను వివరించారు. ఎంఎస్‌టిసి ప్రతినిధులు బాచుపల్లి లే ఔట్ పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చి ఆన్‌లైన్ వేలం ప్రక్రియలో ఏవిధంగా పాల్గొనాలనే అంశాలను వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News