Thursday, January 23, 2025

మేడిపండే…

- Advertisement -
- Advertisement -

బ్యారేజీ డిజైన్ లోనే లోపాలు…నాణ్యతలో డొల్లతనం?

మన తెలంగాణ/హైదరాబాద్ :  కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీ టి ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లొసుగులు వెలుగులోకి వస్తున్నాయి. గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ డిజైన్ల రూపకల్పనలోనే లోపాలు ఉన్నట్టు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీల్లో గుర్తించినట్టు తెలిసింది. బ్యారేజీ నిర్మాణ పనుల్లో నిర్ణీత నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని విజిలెన్స్ విచారణలో వెలుగు చూసినట్టు సమాచారం. మే డిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు గల కారణాలను వెలికితీసేందు కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రం గంలోకి దిగి కీలక అంశాలకు సంబంధించిన రికార్డులు, క్షేత్రస్థాయిలో తనిఖీల ద్వారా గుర్తించిన అంశాలు, నీటి పారుదల శాఖ కార్యాలయాల్లో సిబ్బంది నుంచి సేకరించిన సమాచారం , క్వాలిటీ కంట్రోల్ రికార్డులు తదితర అంశాలపై సమగ్రంగా అ ధ్యయనం చేసింది. మేడిగడ్డపై మధ్యంతర నివేదికను సిద్ధం చేసింది.

మరో వారం రోజుల్లో పూర్తిస్థాయిలో నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేయనున్నట్టు విజిలెన్స్ వర్గాలు తెలిపాయి. గోదావరి నదీ జలాలను వినియోగించుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్న మహోన్నత లక్షంతో గత ప్రభుత్వం కాళేశ్వర్వం ఎత్తిపోతల సాగునీటి పథకాన్ని నిర్మించింది. సుమారు రూ.90వేల పైగా వ్యయం చేసి నిర్మించిన ఈ ప్రాజెక్టులో నాణ్యతా ప్రమాణాలను పరిరక్షంచాల్సిన క్వాలిటీ కంట్రోల్ యంత్రాంగం వైఫల్యాలు విజిలెన్స్ విచారణలో వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు గుండెకాయ వంటి మేడిగడ్డ బ్యారేజీలో గడ్డర్ల పగుళ్లు నాణ్యతలో డొల్లతనాన్ని బయటపెట్టాయని విజిలెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కుంగిపోయన మేడిగడ్డలో బ్యారేజీలోని ఏడో బ్లాక్‌లోనే కాకుండా దానికి ఇరువైపులా ఉన్న ఆరో బ్యాక్ , ఏనిమిదో బ్లాకులోనూ ఆ ప్రభావం పడినట్టు అధికారులు తనిఖీల్లో గుర్తించనట్టు తెలుస్తోంది. బ్యారేజీలో మొత్తం 11 పియర్స్ దెబ్బతిన్నట్టు చెబుతున్నారు. బ్యారేజీకి రిపేర్లు చేసినా పూర్తిస్థాయిలో ఫలితాలు ఇస్తాయని చెప్పలేమంటున్నారు. సుమారు రూ.3200 వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు పనికిరాకుండా పోతే వ్యయం చేసిన నిధులు వృథాగా పోతాయన్న ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. బ్యారేజీ మనుగడపై నిగ్గు తేల్చేందుకు ఎక్స్‌పర్ట్ కమిటీ అవసరం అని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికలో ప్రభుత్వానికి సూచిస్తున్నట్టు సమాచారం.

నిపుణుల కమిటీ సూచనల మేరకే తుదినిర్ణయం తీసుకోవాల్సి సూచిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాజీవ్ రతన్ అధ్వర్యంలో ఆ విభాగం అధికారుల బృందం ఈ నెల 16,17తేదీల్లో మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వెళ్లి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించింది. బ్యారేజీ కుంగిన ప్రాంతంలో పియర్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించింది. బ్యారేజీ నిర్మాణం సందర్భంగా పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించిన నీటి పారుదల శాఖ ఇంజినీర్లతో మాట్లాడింది. గత రెండు, మూడు సీజన్ల నుంచే బ్యారేజీలో సమస్యలు తలెత్తినట్టు విజిలెన్స్ దృష్టికి వచ్చింది. బ్యారేజీ డిజైన్లు, నిర్మాణ పనుల్లో వాడిన సిమెంట్, స్టీల్ తదితర మెటిరియల్, నిర్ధేశిత ప్రమాణాల మేరకు ఎంత వాడాలి, ఎంత వాడారు, కాంక్రిట్ మిక్సింగ్ ఎలా చేశారు. పాటించిన ప్రమాణాలు ఏమిటి తదితర అంశాలకు సంబందించిన రికార్డులను పరిశీలించింది. అన్ని అంశాలను క్రోడీకరించి రికార్డుల సమగ్ర విశ్లేషణ అనంతరం విజిలెన్స్ విభాగం మధ్యంతర నివేదికను సిద్ధం చేసినట్టు సమాచారం.

Medipande2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News