Saturday, December 28, 2024

ధ్యానం అనేది పని కాదు… ప్రతి పనిని ధ్యానంగా చేయాలి: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్: ధ్యానం అనేది ఒక పని కాదని, ప్రతి పనిని ధ్యానంగా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మహాబోధి బుద్ధవిహార్‌కు ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని, ధ్యాన మందిరం కోసం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మహేంద్రహిల్స్‌లోని బుద్ధ పూర్ణిమ సందర్భంగా బౌద్ధ భిక్షవులు నిర్వహిస్తున్న మహా బోధి బుద్ధ విహార్ వేడుకల్లో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. ప్రతిపాదనలు పంపితే కోడ్ ముగిశాక నిధులు మంజూరు చేస్తామని, సమాజంలో అశాంతి, అసూయను అందరు అధిగమించాలన్నారు. సమాజానికి మేలు చేయాలన్న ఆలోచనను ఇతరులకు పంచాలని, గౌతమ బుద్ధుడు బోధించిన సందేశం అందరికీ అవసరమని రేవంత్ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News