Saturday, November 2, 2024

ప్రీక్వార్టర్స్‌లో జకోవిచ్, మెద్వెదేవ్

- Advertisement -
- Advertisement -

లండన్ : వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అగ్రశ్రేణి క్రీడాకారులు నొవాక్ జకోవిచ్ (సెర్బియా), డానిల్ మెద్వెదేవ్ (రష్యా) మూడో రౌండ్‌లో విజయం సాధించారు. మహిళల సింగిల్స్‌లో 9వ సీడ్ పెట్రా క్విటోవా (చెక్), 13వ సీడ్ బియార్టిజ్ హదాద్ మయా(బ్రెజిల్) ప్రీక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. శనివారాం జరిగిన మూడో రౌండ్‌లో క్విటోవా 63, 75 తేడాతో సెర్బియాకు చెందిన నటలిజా కోస్టిక్‌ను ఓడించింది. తొలి సెట్‌లో సునాయాసంగా గెలిచిన క్విటోవాకు రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయితే చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న క్విటోవా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ముందంజ వేసింది.

మరోవైపు హదాద్ అలవోక విజయతో ప్రీక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. రుమేనియా క్రీడాకారిణి సొరానా క్రిస్టియాతో జరిగిన మూడో రౌండ్‌లో హదాద్ 62, 62తో జయకేతనం ఎగుర వేసింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన హదాద్ ఏ దశలోనూ ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. వరుసగా రెండు సెట్లను గెలిచి నాలుగో రౌండ్‌కు చేరుకుంది. మరోవైపు టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్) కూడా మూడో రౌండ్‌లో విజయం సాధించింది. క్రొయేషియా క్రీడాకారిణి పెట్రా మార్టిక్‌తో జరిగిన మూడో రౌండ్‌లో ఇగా 62, 75తో జయభేరి మోగించింది. రెండో సెట్‌లో ఇగాకు ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైంది. అయితే టైబ్రేకర్‌లో సెట్‌ను గెలిచిని ఇగా ముందంజ వేసింది. కాగా, ఐదో సీడ్ కరొలైన్ గార్సియా (ఫ్రాన్స్) మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది.

డానిల్ ముందుకు..
మరోవైపు పురుషుల సింగిల్స్ మూడో సీడ్ డానిల్ మెద్వెదేవ్ అలవోక విజయంతో నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు. శనివారం జరిగిన మూడో రౌండ్‌లో డానిల్ 46, 63, 64, 64 తేడాతో హంగేరికి చెందిన మార్టన్ ఫుక్సొవిక్స్‌ను ఓడించాడు. తొలి సెట్‌లో డానిల్‌కు చుక్కెదురైంది. అయితే తర్వాత జరిగిన మూడు సెట్లలో డానిల్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, రెండో సీడ్ జకోవిచ్ విజయం సాధించాడు. స్విట్జర్లాండ్ ఆటగాడు వావ్రింకాతో జరిగిన మూడో రౌండ్‌లో జకోవిచ్ 63, 61, 76తో జయభేరి మోగించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన జకోవిచ్ వరుసగా మూడు సెట్లు గెలిచి జయకేతనం ఎగుర వేశాడు. కాగా, ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లేవ్ (రష్యా), 26వ సీడ్ షపవలోవ్ (కెనడా) తదితరులు కూడా ప్రీక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News