Saturday, November 23, 2024

సెమీఫైనల్లో మెద్వెదెవ్

- Advertisement -
- Advertisement -

Medvedev reaches US Open men's singles semifinals

కొనసాగుతున్న లేలా సంచలనాలు
యుఎస్ ఓపెన్

న్యూయార్క్: రష్యాకు చెందిన రెండో సీడ్ డేనియల్ మెద్వెదెవ్ యుఎస్ ఓపెన్ పురుఫుల సింగిల్స్ సెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు. మంగళవారం ఆర్థర్ యాష్ స్టేడియంలో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో డచ్ క్వాలిఫైయర్ బోటిక్ వాన్ డి జాండ్‌స్కుల్ప్‌పై 6 3,60,4 6,75 స్కోరుతో నాలుగు సెట్లలో విజయం సాధించి సెమీ ఫైనల్స్‌కు చేరాడు. సెమీ ఫైనల్లో విజయం సాధిస్తే ఫైనల్లో బహుశా టాప్‌సీడ్ నొవాక్ జకోవిచ్‌తో మరోసారి టైటిల్ పోరుకు సిద్ధం కానున్నాడు. 2019యుఎస్ ఓపెన్ ఫైనల్లో మోద్వెదెవ్ జకోవిచ్ చేతిలో పరాజయం పాలయిన విషయం తెలిసిందే. సెమీ ఫైనల్లో మెద్వెదెవ్ 12వ సీడ్, కెనడాకు చెందిన ఫెలిక్స్ ఆగర్ అలియాసిమ్‌తో తలపడనున్నాడు. క్వార్టర్ ఫైనల్లో ప్రత్యర్థి కార్లోస్ అల్కారజ్ కాలి గాయం కారణంగా రెండో సెట్ మధ్యలోనే పోటీనుంచి తప్పుకోవడంతో ఆగర్ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు.

స్విటోలినా ఇంటికి

కాగా మహిళల సింగిల్స్ విభాగంలో 19 ఏళ్ల లేలా ఫెర్నాండెజ్ సంచనాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ నవోమి ఒసాకా, మూడుసార్లు గ్రాండ్‌శ్లామ్ విజేత ఏంజలిక్ కెర్బర్ లాంటి దిగ్గజాలను మట్టి కరిపించిన లేలా క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్, ఉక్రెయిన్‌కు చెందిన ఎలీనా స్విటోలినాతో హోరాహోరీగా జరిగిన పోరులో 6 3, 36, 76(7/5) స్కోరుతో విజయం సాధించి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. తొలి సెట్‌ను 38 నిమిషాల్లో సొంతం చేసుకున్న తర్వాత ఫెర్నాండెజ్‌కు ఎదురు లేదనిపించింది. అయితే రెండో సెట్‌లో స్విటోలినా రెండుసార్లు ఫెర్నాండెజ్ సర్వీస్‌ను బ్రేక్ చేయడం ద్వారా ఆ సెట్‌ను దక్కించుకుని స్కోరును సమం చేసింది. నిర్ణాయక మూడో సెట్‌లో ఇద్దరూ నువ్యావనేనా అన్నట్లుగా ప్రత్యర్థిపై పై చేయి సాధించడానికి సర్వశక్తులూ ఒడ్డారు. అయితే చివరికి విజయం ఫెర్నాండెజ్‌నే వరించింది. సెమీఫైనల్లో లేలా రెండో సీడ్, బెలారస్‌కు చెందిన అర్యానా సబలెంకోతో తలపడనుంది. క్వార్టర్ ఫైనల్లో సబలెంకో ఎనిమిదో సీడ్ , ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ బర్బరా క్రొజిసికోవాపై 61, 64స్కోరుతో సునాయాసంగా విజయం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News