- Advertisement -
అమరావతి: టిడిపి నేత బండారు సత్యనారాయణ మూర్తిపై సినీ నటి మీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాపై టిడిపి నేత బండారు నీచమైన వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని మండిపడ్డారు. బండారు తక్షణమే మంత్రి రోజాకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని నిలదీశారు. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బండారు ఎంత దిగజారుడు మనస్తత్వం ఉన్నవాడో అర్ధమయ్యేలా ఉన్నాయని దుయ్యబట్టారు. రోజా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడే హక్కు బండారుకు ఎవరు ఇచ్చారని మీనా ప్రశ్నించారు. మంత్రి రోజా చేసే పోరాటానికి తాను అండగా ఉంటానని వివరించారు. ఎంపి, నటి నవనీత్ కౌర్, రాధిక, ఖుష్బూ, రమ్యకృష్ణ సహా పలువురు బండారు నీచపు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
Also Read: నడ్డా.. ఇది కెసిఆర్ అడ్డా
- Advertisement -