Sunday, December 22, 2024

రెండో పెళ్లిపై హీరోయిన్ మీనా ఏం చెప్పిందంటే..

- Advertisement -
- Advertisement -

బాలనటిగా చిత్రరంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత హీరోయిన్ గా నిలదొక్కుకున్నవారిలో మొదటి స్థానం శ్రీదేవిది అయితే రెండోస్థానం మీనాకు దక్కుతుంది. అక్కినేని, శోభన్ బాబు, కృష్ణ వంటి పెద్ద హీరోలకు కుమార్తెగానో, చెల్లెలిగానో నటించి ఎంతో పేరు తెచ్చుకున్న మీనా, ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగి చాలామంది పెద్ద హీరోల సరసన హీరోయిన్ గా నటించింది.

ఇక చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ పక్కన జోడిగా అనేక సినిమాల్లో నటించింది. మీనాకు బెంగళూరుకు చెందిన విద్యాసాగర్ అనే బిజినెస్ మాన్ తో 2009లో పెళ్లయింది. ఈ జంటకు నైనిక అనే పాప కూడా ఉంది. అయితే విద్యాసాగర్ 2022లో అకస్మాత్తుగా కన్నుమూశారు. పోస్ట్ కోవిడ్ సమస్యల కారణంగా ఆయన మరణించడం మీనాకు కోలుకోలేని దెబ్బగా మారింది. అప్పటినుంచి తన కూతురులోనే భర్తను చూసుకుంటూ మీనా కాలం గడుపుతోంది. తల్లిలాగే మీనా కూతురు నైనిక కూడా బాలనటిగా చిత్రరంగ ప్రవేశం చేసింది. ముద్దులొలికే ఈ చిన్నారి హీరో విజయ్ నటించిన ‘తెరా’ మూవీలో బాలనటిగా నటించింది.

తాజాగా మీనా రెండో పెళ్లి చేసుకుంటోందంటూ పుకార్లు చెలరేగుతున్నాయి. దీనిపై ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా వెనకాముందూ చూడకుండా అవాస్తవాలను రాస్తోందని, తెలుసుకుని రాస్తే మంచిదని హితవుచెప్పింది. తాను ఏ నిర్ణయం తీసుకున్నా తన తల్లిదండ్రులు, కుమార్తె భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకుంటానని మీనా చెప్పింది. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటానో ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదు కదా అని ఆమె పేర్కొంది. ప్రస్తుతం తాను రెండో పెళ్లి గురించి ఆలోచించట్లేదని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News