Sunday, December 22, 2024

చక్కని సినిమా ‘లక్కీ భాస్కర్’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దర్శకుడు వెంకీ అట్లూరి, నటుడు దుల్కర్ సల్మాన్ తో తీసిన సినిమా ‘లక్కీ భాస్కర్’ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమా కథ చాలా సాఫీగా సాగిపోతుంది. ఓ మధ్యతరగతి వ్యక్తి సమస్యలు, బాధలు వంటివన్నీ ఈ సినిమాలో ఉంటాయి. నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సినిమాలో హాస్యం, డ్యాన్సులు లేకపోయినా ఎక్కడా బోర్ కొట్టదు. దుల్కర్ సల్మాన్ బాగా నటించాడు.

సినిమా కథంతా బాంబేలోని మిడిల్ క్లాస్ లోకాలిటీకి చెందిన 1989-92 మధ్య కాలానికి సంబంధించింది. నటి మీనాక్షి చౌదరి కూడా తన పాత్రలో బాగా ఒదిగిపోయింది. ఈ సినిమాలో స్టాక్ మార్కెట్, మనీలాండరింగ్ కు సంబంధించిన అంశాలున్నాయి. కథనం చాలా నేర్పుగా ఉంటుంది. బ్యాంకు ఉద్యోగిగా నటించిన దుల్కర్ జీవితంలో ఎన్నెన్ని సమస్యలు అధిగమించి ఓ ప్రసిద్ధ ధనవంతుడిగా ఎదిగాడనేది సినిమాలో చక్కగా చిత్రీకరించారు. చూడదగిన సినిమా అనే చెప్పాలి. సినిమాలో వంకపెట్టడానికి, తప్పు పట్టడానికి ఏమిలేదు. అయితే వాస్తవంలో ఇంత సినిమాటిక్ గా జరిగే అవకాశం ఉంటుందా అన్న సందేహం కూడా రావచ్చు.

నటీనటులు: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, సాయి కుమార్.

దర్శకుడు: వెంకీ అట్లూరి.

సినిమా నిడివి: 150 నిమిషాలు.

రేటింగ్: 3.5/5

రివ్యూ: అశోక్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News