Monday, December 23, 2024

నాలో మంచి నటిని చూస్తారు: మీనాక్షి చౌదరి

- Advertisement -
- Advertisement -

అందాల తార మీనాక్షి చౌదరి కెరీర్ ప్రారంభించిన అతికొద్ది కాలంలోనే టాలీవుడ్ లో దూసుకుపోతోంది. వరుసగా అవకాశాలు అందుకుంటూ, గ్లామర్ బ్యూటీ అనిపించుకుంది. ఇప్పుడు ఈ హీరోయిన్ తనలోని నటిని కూడా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. దీనికి ‘లక్కీ భాస్కర్’ సినిమాను ఉదాహరణగా చెబుతోంది. “లక్కీ భాస్కర్‌లో నా పాత్రపై చాలా ఆసక్తికరంగా ఉన్నాను. ఎందుకంటే నా పాత్రతో ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్ దక్కుతుంది. సినిమాలో నా పాత్ర చాలా బాగుంటుంది. రొమాన్స్, ఫన్, సెంటిమెంట్ అన్నీ ఉంటాయి.

ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో ఇదే బెస్ట్. ఆడియన్స్ కు బాగా నచ్చుతుంది. నాలో మంచి నటిని చూస్తారు”అని మీనాక్షి చౌదరి పేర్కొంది. ఇలా ‘లక్కీ భాస్కర్’తో పూర్తిస్థాయిలో తనలోని నటిని చూస్తారని నమ్మకంగా చెబుతోంది ఈ భామ. ఈ సినిమాతో పాటు ఆమె వెంకటేశ్, విశ్వక్ సేన్ సరసన సినిమాలు చేస్తోంది. ‘లక్కీ భాస్కర్’లో తన పాత్రను చూసిన తర్వాత తన పాత్రను మరింతగా ఆదరిస్తారని చెబుతోంది. దీపావళి కానుకగా ఈనెల 31న థియేటర్లలోకి వస్తోంది ‘లక్కీ భాస్కర్’.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News