Sunday, December 29, 2024

వరుసగా సినిమాలతో బిజీ బిజీగా మీనాక్షి చౌదరి…

- Advertisement -
- Advertisement -

క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. హిట్ 2 సూపర్ హిట్ కావడంతో మీనాక్షికి తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఈ ఏడాదిలో మీనాక్షి చౌదరి ఏకంగా ఆరు సినిమాల్లో నటించింది. అందులో అయిదు విడుదల అయ్యాయి. ఆమె 2024లో నటించిన ఆరో చిత్రం సంక్రాంతికి వస్తున్నాం.

ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14, 2025న థియేటర్లలోకి రానుంది. ఇక 2025లో కూడా కూడా సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజు అనే రెండు చిత్రాలు విడుదల అవుతాయి. మరో ఒకటో, రెండో కొత్త చిత్రాలు కూడా ఆమె వళ్ళో వాలుతాయి. ఆ లెక్కన 2025లో కూడా మూడు, నాలుగు చిత్రాలు చేసినట్లు అవుతుంది. మీనాక్షి చౌదరి 2018లో ఫెమినా మిస్ ఇండియా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్. అలాగే మీనాక్షి రాష్ట్ర స్థాయిలో టెన్నిస్ ప్లేయర్. ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటూ కలర్‌ఫుల్ ఫొటోలతో అభిమానులను మురిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News