Thursday, January 9, 2025

మంచి సినిమాలు చేయాలని అప్పుడే గ్రహించాను

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు యంగ్ హీరోల సరసన హీరోయిన్‌గా చేస్తోంది. ప్రస్తుతం ఆమె నటించిన ’సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సంక్రాంతి పండగకు విడుదల కాబోతోంది. తాజాగా మీనాక్షి మాట్లాడుతూ ’ది గోట్’ సినిమా తర్వాత తనపై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయని, దాంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాయని తెలిపింది. తలపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటించిన ’ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ విడుదలైన తర్వాత ఆన్‌లైన్‌లో తనను చాలా ట్రోల్ చేశారని వెల్లడించింది. ‘గోట్ సినిమాలో నటించిన తర్వాత, నన్ను చాలా మంది ట్రోల్ చేశారు. అవి చూసి ఎంతో బాధపడ్డాను. నేను ఒక వారం పాటు డిప్రెషన్ లోకి వెళ్ళాను. కానీ ’లక్కీ భాస్కర్’ చిత్రంతో నాకు మంచి ప్రశంసలు వచ్చాయి. నేను మంచి సినిమాలు చేయడంపైనే దృష్టి పెట్టాలని అప్పుడే గ్రహించాను” అని మీనాక్షి తెలిపింది. ఇకపోతే ’సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో విక్టరీ వెంకటేష్‌తో కలిసి నటించింది మీనాక్షి చౌదరి. ఇందులో పోలీసాఫీసర్‌గా, వెంకీ మాజీ ప్రేయసిగా మీనాక్షి కనిపించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News