- Advertisement -
హీరోయిన్లకు కూడా కోరికలుంటాయి, లక్షాలు ఉంటాయి. వాటిని సాధించుకునేందుకు వాళ్లు కష్టపడుతుంటారు కూడా. మీనాక్షి చౌదరికి కూడా అలాంటి మూడు కోరికలున్నాయి. వాటిలో రెండు కోరికల్ని ఆమె తీర్చుకుంది. మూడోది మిగిలిపోయింది. “వయసు పెరిగేకొద్దీ మూడు కలలు కనేదాన్ని. అందులో ఒకటి యాక్టర్ అవ్వాలనే కల. రెండోది మిస్ ఇండియా అవ్వాలి. ఇక మూడోది సివిల్ సర్వెంట్. మొదటి రెండు కలలు నెరవేరాయి. మూడోది మాత్రం నెరవేర్చుకోలేకపోతున్నాను”అని మీనాక్షి చౌదరి పేర్కొంది. సివిల్ సర్వెంట్ అవ్వాలనే ఆమె కోరిక బహుశా తీరకపోవచ్చు. ఎందుకంటే ఆమె సినిమాలతో తెగ బిజీగా ఉంది. టాలీవుడ్‌లో ఇప్పుడు ఆమె లీడింగ్ హీరోయిన్.
- Advertisement -