Thursday, January 23, 2025

అది అవినీతి కూటమి: ఆప్-కాంగ్రెస్ పొత్తుపై బిజెపి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం ఆప్, కాంగ్రెస్ మధ్య కుదిరిన పొత్తును అవినీతి కూటమిగా బిజెపి శనివారం అభివర్ణించింది. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని అధికార కూటమిని ఢీకొనే సత్తా ఈ రెండు పార్టీలకు ఏ రకంగాను లేవని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి, ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టలు పొత్తు కుదుర్చుకున్న ఢిల్లీ, గుజరాత్, హర్యానా, చండీగఢ్, గోవాలో బిజెపికి గత లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లు వచ్చాయని లేఖి తెలిపారు. ప్రజా సేవకే అంకితమైన వారికి ఈ అవినీతి కూటమి ఏ రకంగాను పోటీ కాదని ఆమె చెప్పారు.

గతంలో కాంగ్రెస్ నాయకులపై ఆప్ నాయకులు అవినీతి ఆరోపణలు గుప్పించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలతో తన అనుబంధాన్ని కోల్పోయారని సచ్‌దేవ వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఎ ప్రభుత్వంలో పనిచేసిన చాలా మంది మంత్రులను అవినీతిపరులుగా వర్ణించిన కేజ్రీవాల్ దివంగత రాజీవ్ గాంధీకి ప్రకటించిన భారతరత్నను కూడా ఉపసంహరించాలని డిమాండు చేశారని లేఖి గుర్తు చేశారు. తమ కాళ్లపై తాము నిలుచునే బలం లేని ఈ రెండు పార్టీలురస్పరం మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయని, ఇది జరిగే పని కాదని ఆమె చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News