Monday, April 7, 2025

కంచ గచ్చిబౌలి భూములపై అందరి వాదనలు వింటాం

- Advertisement -
- Advertisement -

ఏకపక్షంగా వ్యవహరించం ఎవరికీ నష్టం జరగకుండా
వివాదం పరిష్కరిస్తాం మంత్రుల కమిటీతో అన్ని
అంశాలు చర్చిస్తున్నాం హెచ్‌సియు విద్యార్థుల
లేఖలపై సమాచారం సేకరిస్తాం రాష్ట్ర వ్యవహారాల
ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఎన్‌ఎస్‌యుఐ నాయకుల
తీరుపై అసంతృప్తి సోషల్‌మీడియా ప్రచారంలో
ఎందుకు వెనుకబడి ఉన్నామని నిలదీత

మన తెలంగాణ/హైదరాబాద్ : పర్యావరణాన్ని కాపాడటానికి కాంగ్రెస్ పోరాటం చేస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇం చార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సియూ) భూముల వివాదంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో అన్ని అంశాలు చర్చిస్తున్నామని, ఏకపక్షంగా కాకుండా అందరి వాదనలు వింటామని ఆమె తెలిపా రు. కంచ గచ్చిబౌలి భూవివాదంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ కమిటీ సభ్యులు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో శనివారం ఆమె చర్చలు జరిపారు. అనంతరం ఎన్‌ఎస్‌యూఐ నాయకులతోనూ ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజ న్ మాట్లాడుతూ గచ్చిబౌలి భూములపై ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. ఎవరికీ నష్టం జరగకుం డా వివాదం పరిష్కరించాలన్నదే తమ ఆలోచన అని ఆమె తెలిపారు. ‘

వర్శిటీ విద్యార్థుల లేఖలపై సమాచారం సేకరిస్తామన్నా రు. ప్రతిపక్షాల ఆరోపణలపై వాస్తవాలను ప్రజలకు వివరిస్తామ న్నారు. ఈ భూ వివాదం తీవ్ర వివాదస్పదంగా మారడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ను రంగంలోకి దించింది. హైకమాండ్ ఆదేశాలతో శనివారం హైదరాబాద్ వచ్చిన మీనాక్షి నటరాజన్ హెచ్‌సియూ భూముల వివాదంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ కమిటీతో పాటు కాంగ్రెస్ అనుబంధ విభాగం ఎన్‌ఎస్‌యూఐ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో గచ్చిబౌలి భూవివాదం గురించి ఆమె సుదీర్ఘంగా చర్చించారు.

నేడు ప్రజాసంఘాలు, సామాజిక కార్యకర్తలతో మీనాక్షి భేటీ
నేడు ప్రజాసంఘాలు, సామాజిక కార్యకర్తలతో మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నారు. హెచ్‌సియూ భూముల వివాదంపై వారితో మీనాక్షి నటరాజన్ చర్చించనున్నారు. ఆ భూముల వ్యవహారంపై వారి దగ్గర సమాచారాన్ని అడిగి తెలుసుకోవడంతో పాటు రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలన్న విషయాలను వారి సూచనలు, సలహాలను ఆమె పరిగణలోకి తీసుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News