Sunday, January 19, 2025

సంక్రాంతికి వస్తున్నాం.. మరో సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

విక్టరీ వెంకటేశ్‌, యంగ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఫ్యామిలీ, క్రైమ్ కామెడీ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇందులో భాగంగా ఒక్కో పాటను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన గోదారిగట్టు మీద.. అనే సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మీనూ.. అనే సెకండ్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో పాడిన ఈ సాంగ్.. ఆకట్టుకుంటోంది. దిల్ రాజ్, సిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News