Friday, July 5, 2024

ఉత్పలదేవిగా ఎవర్‌గ్రీన్ బ్యూటీ.. టాలీవుడ్ లోకి మీరా జాస్మిన్ రీఎంట్రీ

- Advertisement -
- Advertisement -

టైటిల్ స్టోరీ గ్లింప్స్, క్వీన్ శ్వాగ్ గ్లింప్స్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసిన తర్వాత ’శ్వాగ్’ మేకర్స్ ఎవర్‌గ్రీన్ బ్యూటీ మీరా జాస్మిన్‌ను ఉత్పల దేవిగా పరిచయం చేశారు. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ పోస్టర్‌లో మీరా జాస్మిన్ హెవీ జ్యువెలరీ డిజైనర్ వేర్‌లో రాణిలా కనిపిస్తుంది. ఆమె క్యారెక్టర్‌కు ఇది పెర్ఫెక్ట్ లుక్. కొంత బ్రేక్ తీసుకున్న మీరా జాస్మిన్ చాలా కాలం తర్వాత ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది.

శ్రీవిష్ణు, హసిత్ గోలి కాంబినేష లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వింజమర వంశంలో క్వీన్ రుక్మిణి దేవిగా రీతూ వర్మ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఔట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘శ్వాగ్’ శ్రీవిష్ణు, హసిత్ గోలీల నుండి మరొక యూనిక్ సినిమా. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News