Friday, December 27, 2024

ఇంద్రగంటి బెస్ట్ మూవీ..

- Advertisement -
- Advertisement -

Meere Hero Laa song out from 'Aa Ammayi Gurinchi Meku Cheppali'

హీరో సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో విలక్షణమైన ప్రేమకథగా వస్తున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంలో సుధీర్ బాబుకు జోడిగా యంగ్ బ్యూటీ కృతిశెట్టి కనిపించనుంది. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి ‘మీరే హీరో లాగ’ పాటని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. దర్శకుడు హను రాఘపుడి ఈ ఈవెంట్‌కి అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ “ఈ పాటను మీడియాకి అంకితం చేస్తున్నాం. ఇందులో కృతి అద్భుతమైన పాత్ర చేసింది. వివేక్ సాగర్ వండర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇంద్రగంటి బెస్ట్ మూవీ ఇది”అని అన్నారు. దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మాట్లాడుతూ “ఈ పాట క్రెడిట్ రామజోగయ్య శాస్త్రి, దినేష్, వివేక్‌కి దక్కుతుంది. సుధీర్ ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు. ఇది నా మోస్ట్ ఎమోషనల్ ఫిల్మ్‌”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృతి శెట్టి, గాజులపల్లె సుధీర్ బాబు, రామజోగయ్య శాస్త్రి, వివేక్ సాగర్, పీజీ విందా, సాహి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Meere Hero Laa song out from ‘Aa Ammayi Gurinchi Meku Cheppali’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News