- Advertisement -
హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులతో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట మండలంలోని చైతన్యపురిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హస్తినాపురం ప్రాంతంలోని టీచర్స్ కాలనీలో ఆకుల దీపిక(38) తన భర్త, కుమారులు, కూతుళ్లతో కలిసి ఉంటుంది. దీపిక నాగోల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తుంది. గత కొంత కాలంగా ఆర్థిక సమస్య ఎక్కువగా మానసికంగా ఇబ్బందిపడుతోంది. ఆర్థిక ఇబ్బందులతో దీపిక ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త రవి కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -