Saturday, December 21, 2024

బాలికపై జూడో ట్రైనర్ అత్యాచారం….

- Advertisement -
- Advertisement -

లక్నో: 12 ఏళ్ల బాలికపై జూడో ట్రైనర్ అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వచ్చిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మీరట్ ప్రాంతం కంకర్‌ఖేడా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జూన్ 2న ఉదయం ఏడు గంటలకు తన సోదరుడితో కలిసి ఆమె జూడో ట్రైనియింగ్‌కు వెళ్లింది. అందరూ పది గంటల వరకు శిక్షణ తీసుకొని ఇంటికి బయలు దేరారు. బాలిక ఎక్కువ శిక్షణ ఇవ్వాలని జూడో ట్రైయినర్ ఆమెన తన దగ్గర ఉంచుకున్నాడు. ఓ రూమ్‌లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆమె తన సోదరుడికి జరిగిన విషయం చెప్పడంతో ఇద్దరికి మనీష్ చాక్లెట్లు, పాపకు గాయకావడంతో స్థానికంగా ఉన్న నర్సింగ్ హోమ్‌లో చేర్పించాడు. బాలిక తండ్రిని అక్కడికి చేరుకొని తన కూతురికి ఏమైందని వైద్యులను ప్రశ్నించాడు. బాలికపై అత్యాచారం జరిగినట్టుగా అనుమానాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. దీంతో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మనీష్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Also Read: రోహిత్ ఖాతాలో మరో రికార్డు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News