Friday, January 10, 2025

ఒకే ఇంట్లో ఐదు మృతదేహాలు

- Advertisement -
- Advertisement -

లక్నో: ఒకే ఇంట్లో దంపతులతో పాటు ముగ్గురు కూతుళ్ల మృతదేహాలు కనిపించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లోని లిసాడి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మొయిన్- అస్మా అనే దంపతులు తన ముగ్గురు పిల్లలు అప్సా(8), అజిజా(04), అదిబా(01)లతో కలిసి ఉంటున్నారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డోర్‌ను బలవంతంగా ఓపెన్ చేశారు. దంపతుల మృతదేహాలు నేలపై పడివుండగా పిల్లల మృతదేహాలు బాక్స్‌లో ఉన్నాయి. మొయిన్ మృతదేహం బెడ్ షీటు కట్టి ఉందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులలో ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ఇంకా ఒకరు పరారీలో ఉన్నారన్నారు. పాత కక్షల నేపథ్యంలో హత్యలు చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News