Saturday, April 19, 2025

ప్లాన్ చేసి భర్త శవం కింద పాము ఉంచిన భార్య…. అసలు విషయం తెలిస్తే షాక్

- Advertisement -
- Advertisement -

లక్నో: ప్రియురాలు తన ప్రియుడితో కలిసి భర్తను గొంతు నులిమి చంపి అనంతరం మృతదేహం కింద పామును పడేసింది. అనంతరం తన భర్త పాము కరవడంతో చనిపోయాడని జనాలను నమ్మించింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మీరట్ జిల్లాలోని బెహసుమ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అక్బర్‌పూర్ గ్రామంలో అమిత్-రవిత అనే దంపతులు నివసిస్తున్నారు. అమిత్‌కు అమర్‌దీప్ అనే స్నేహితుడు ఉన్నాడు. అమర్ దీప్ పలుమార్లు అమిత్ ఇంటికి రావడంతో రవితకు పరిచయమయ్యాడు. ఈ పరిచయం రవితతో అమర్‌దీప్‌కు వివాహేతర సంబంధానికి దారితీసింది. అక్రమ సంబంధం విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు భార్యతో అమిత్ గొడవ పెట్టుకున్నాడు.

ప్రియుడితో కలిసి భర్త గొంతు నులిమి భార్య చంపింది. అనంతరం 1000 రూపాయలకు పామును కొనుగోలు చేసి భర్త మృతదేహం కింద పెట్టింది. మృతదేహాన్ని పాము పలుమార్లు కరిసింది. తన భర్త పాము కాటుతో చనిపోయాడని జనాలను నమ్మించింది. దీంతో స్థానికులు, పోలీసులు పాము కాటుతో చనిపోయి ఉంటారని భావించారు. మృతదేహాన్ని పోలీసులు శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శవ పరీక్ష నివేదికలో గొంతు నులిమి చంపేశారని తేలడంతో మృతదేహంపై పది పాముకాట్లు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. దీంతో భార్యను పోలీసులు అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించారు. తన ప్రియుడితో కలిసి భర్తను చంపానని ఒప్పుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News