Thursday, February 20, 2025

పళ్లతో 125 కిలోలు పైకెత్తడంలో యోగాభ్యాసకుని గిన్నిస్ రికార్డు

- Advertisement -
- Advertisement -

మీరట్‌కు చెందిన యోగాభ్యాసకుడు వికాస్ స్వామి పళ్లతో 125 కిలోల బరువునెత్తి గిన్నిస్‌వరల్డ్ రికార్డు సాధించాడు. ఇటలీ లోని మిలన్‌లో ఇటీవలనే ఈ పోటీ జరిగింది. స్వామికి ఈ రికార్డు సాధించడంలో తన ఇద్దరు కుమారులు 16 ఏళ్ల అన్మోల్‌స్వామి, 10 ఏళ్ల ఆదిత్యస్వామి సహకరించారు. ఫిబ్రవరి 14న ఇటలీలో ఈ పోటీ జరిగింది. స్వామి విజయవంతంగా 35.57 సెకండ్లలో 125 కిలోలు పళ్లతో పైకెత్తి కొత్తగా ప్రపంచ రికార్డు సృష్టించారు. 2023లో రియాల్టీ షో “ ఇండియాస్ గాట్ టాలెంట్‌” లో తన పళ్లతో 80 కిలోల బరువు ఎత్తగలిగారు.

ఈ సమాచారం తెలిసి ఆయన స్వగ్రామం ఆదివారం ఘనంగా వేడుక జరుపుకుంది. అయితే ప్రభుత్వం కానీ, ప్రజా ప్రతినిధులు కానీ తనను గుర్తించడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి ప్రయత్నంలో కేవలం 25 సెకండ్లలో ఈ బరువునెత్తగా, రెండో ప్రయత్నంలో 35.57 సెకండ్లలో ఎత్తగలిగినట్టు చెప్పారు. తమ కుమారులతోసహా ముగ్గురం సర్టిఫికెట్లను అందుకున్నామన్నారు. చిన్న కొడుకు 61 కిలోల బరువును, పెద్ద కొడుకు 105 కిలోల బరువును పళ్లతో ఎత్తగలిగారని స్వామి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News