Saturday, November 16, 2024

టైమ్స్ 100 అత్యంత ప్రభావంత కంపెనీల్లో మీషో, ఎన్‌పిసిఐ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : టైమ్స్ 100 అత్యంత ప్రభావవంతమై న కంపెనీలు2023 జాబితాలో భారతదేశం నుంచి ఇకామర్స్ మీషో, నేషనల్ పేమెం ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పిసిఐ) చోటు దక్కించుకున్నాయి. గురువారం టైమ్స్ ఈ జాబితాను విడుదల చేసింది. అత్యంత ప్రభావవంతమైన 100 కంపెనీల్లో స్కిమ్స్, ఎన్‌విడియా, స్పేస్‌ఎక్స్, యాపిల్, ఓపెన్‌ఎఐ వంటి దిగ్గజ కంపెనీ ల సరసన భారత్ ఇకామర్స్ సంస్థ మీషో చోటు దక్కించుకోవడం గమనార్హం. మరో సంస్థ బ్లాక్‌చై న్ సాంకేతికతో పనిచేసే పాలిగాన్ ల్యాబ్స్ కూడా ఈ జాబితాలో స్థానం పొందింది.

బడ్జెట్ ధరకే మీషోలో ఉత్పత్తులు
మీషో విక్రేతలకు కమిషన్ చార్జ్ చేయదు, ఏడాదికి రూ.5 లక్షల లోపు భారతీయ కుటుంబాల ను చేరువయ్యేందుకు ఈ సంస్థ 60 శాతం ఉత్పత్తులను 4 డాలర్లు (రూ.327) లోపే ఉంటాయని టైమ్ మ్యాగజైన్ నివేదిక తెలిపింది. టైమ్ జాబితాలో చేరడం పట్ల మీషో సిఇఒ విదిత్ ఆత్రేయ్ సంతోషం వ్యక్తం చేశారు.
డిజిటల్ చెల్లింపులకు ఎన్‌పిసిఐ
టైమ్ జాబితాలో చోటు దక్కించుకు మరో సంస్థ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎ న్‌పిసిఐ), ఇది భారతదేశంలో కీలక డిజిటల్ చె ల్లింపుల వేదికగా మారింది. దేశవ్యాప్తంగా ఎన్‌పిసిఐకు చెందిన ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రిటైల్ చెల్లింపులు, సెటిల్‌మెంట్లు జరుగుతాయి. దీనిని కనెక్టింగ్ కామర్స్‌గా టైమ్ అభివర్ణించింది. దేశంలో డిజిటల్ చెల్లింపులను బలోపేతం చేసేందుకు ఇ ది ఎంతగానో దోహదం చేస్తోంది. 2018 సం వత్సరంలో ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేష న్ ఈ ఎన్‌పిసిఐని ప్రారంభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News