Monday, December 23, 2024

ఐబి ఆఫీసర్ రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా..

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ టీజర్ ఈ నెల 17న విడుదల కానుండడంతో మరో మూడు రోజుల్లో టైగర్ దండయాత్రను చూడబోతున్నాం. వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. వరుసగా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్ ,కార్తికేయ 2 తర్వాత మేకర్స్ నుంచి వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు వున్నాయి. టీజర్‌ను విడుదల చేయడానికి ముందు మేకర్స్ సినిమాలోని ఒక ముఖ్యమైన పాత్రను పరిచయం చేశారు. ప్రొడక్షన్ హౌస్‌లో గతంలో వచ్చిన రెండు సినిమాల్లో భాగమైన అనుపమ్ ఖేర్… టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐబి ఆఫీసర్ రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా పరిచయమయ్యారు అనుపమ్ ఖేర్. రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News