Thursday, January 23, 2025

ఒక రోజు వేతనం రూ.30 లక్షలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : టాటా సన్స్‌లో ప్రస్తుత చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ కింది స్థాయికి నుంచి ఉన్నత స్థానానికి ఎదిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2022 ఫిబ్రవరి 11న టాటా సన్స్ చైర్మన్‌గా ఆయన ఐదేళ్ల పదవీకాలం పొందారు. ఆయన నెల వేతనం రూ.9 కోట్లు ఉంటుంది. దేశంలోని కంపెనీల్లో అత్యధిక వేతనం తీసుకునే సిఇఒగా చంద్రశేఖరన్ ఉంటారు. వ్యాపారంలో ఎక్కువగా ఆయన్ని చంద్ర అని పిలిచేవారు. 2017 సంవత్సరంలో టాటా సన్స్ చీఫ్‌గా చంద్రశేఖరన్ తొలిసారిగా బాధ్యతలు చేపట్టారు. చంద్రశేఖరన్‌కు కంపెనీతో చాలా ఏళ్లుగా అనుబంధం ఉంది.

తమిళనాడులోని మోహనూరు అనే గ్రామీణ ప్రాంతంలో పుట్టిన ఆయన చిన్నప్పుడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నారు. తల్లిదండ్రులది వ్యవసాయ నేపథ్యం, అందుకే తను కూడా చదువుకుంటూ సమయం ఉన్నప్పుడల్లా వ్యవసాయంలో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా నిలిచేవాడు. ఊరిలో చదువులు పూర్తయ్యాకా కొయంబత్తూరులోని కొయంబత్తూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అప్లైడ్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశాడు. ఆ తరువాత తిరుచిరాపల్లిలోని రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసిఎ) పూర్తి చేశాడు. ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న అనంతరం టిసిఎస్ కంపెనీలో ఇంటర్న్‌గా ఉద్యోగంలో చేరాడు.

అక్కడే చిత్తశుద్ధితో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఎదుగుతూ వచ్చారు. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత ఆయనే ఆ కంపెనీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ప్రమోషన్ అందుకున్నాడు. 1987లో టిసిఎస్ కంపెనీలో ఇంటర్న్‌గా చేరిన ఎన్ చంద్రశేఖరన్, 2007 సెప్టెంబర్‌లో అదే కంపెనీకి సిఒఒ అయ్యాడు. సరిగ్గా మరో రెండేళ్లకు అంటే 2009 అక్టోబర్‌లో టిసిఎస్ కంపెనీ సిఇఒ అయ్యాడు. అప్పుడు చంద్రశేఖరన్ వయస్సు 46 ఏళ్లు ఉంది. 2017లో ఆయన టాటా సన్స్ సంస్థకు చైర్మన్ అయ్యారు. 2021-22 సంవత్సరంలో చంద్రశేఖరన్ వేతనం రూ. 109 కోట్లకు పెరిగింది.

అంటే రోజుకు ఆయన వేతనం రూ. 30 లక్షలు, నెలకు రూ. 90 లక్షలు ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌కి ఇచ్చిన ‘వర్కింగ్ : వాట్ వి ఆల్ డే’ అనే డాక్యుమెంటరీకి ఆయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. చిన్నతనంలో తండ్రితో కలిసి వ్యవసాయం పనుల్లో పాల్గొనేవాడినని, కానీ అది తన జీవితం కాదని అనిపించేదని, ఇంకేదో చేయాలి అనే తపనతోనే ఐటి రంగంలోకి వచ్చి ఈ స్థాయికి ఎదిగానని ఆయన చెప్పుకొచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News