- Advertisement -
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరు నివాసి నికితా అయ్యర్ అనుకోకుండా చక్కని ఇంగ్లీషు మాట్లాడే ఓ ఆటో డ్రైవర్ ఆటో ఎక్కింది. అతడు చక్కని ఇంగ్లీషు మాట్లాడుతుండడంతో ప్రయాణిస్తున్నంత సేపు అతడితో మాటామంతీ కలిపింది. ఆయనతో కలిసి సంభాషించిన ఉదంతానంత ఆమె లింకెడిన్‌లో పోస్ట్ చేసింది. “నేను ఈ రోజు పనికి వెళుతున్నప్పుడు హైవే మధ్యలో ఓ ఉబెర్ ఆటో డ్రైవర్‌ను కలిశాను. ఆయన వయస్సులో చాలా పెద్ద వాడు. ఆయన నన్ను ఎక్కడి వెళ్లాలని అడిగాడు. కాస్త సందేహిస్తూనే ఆఫీసుకు వెళ్లాలని చెప్పాను. దానికాయన చక్కని ఇంగ్లీషులో జవాబిచ్చాడు. వచ్చి కూర్చొండి మేడం(ప్లీజ్ కమ్ ఇన్ మేడమ్), మీకు తోచింది ఇవ్వండి’ అని ఆయన చెప్పాడు.
‘మీరు ఇంత బాగా ఇంగ్లీషు మాట్లాడుతున్నారు…అదెలా’ అని నికితా అయ్యర్ అడిగినప్పుడు ఆయన తాను కర్నాటకలో పనిచేయడానికి ప్రయత్నించినప్పుడు ఉద్యోగం దొరక్కపోతే ముంబయి కాలేజ్‌లో దాదాపు 20 ఏళ్లు పనిచేశానని, 60ఏళ్లకు రిటైర్ అయి తిరిగా బెంగళూరు వచ్చేసి ఆటో నడుపుకుంటున్నానని తెలిపాడు. ప్రశ్నించగా ఆయన తన పేరు పట్టాభి రామన్ ఆయన తెలిపాడు.
“ అధ్యాపకులకు మంచి జీతం ఇచ్చేవారు కారు. ప్రైవేట్ సంస్థల్లో ఎక్కువలో ఎక్కువ రూ 10000 నుంచి 15000 మధ్య అందేది. నాకు పింఛను కూడా లేదు. నేను ఆటో నడపడం ద్వారా రోజుకు రూ. 700 నుంచి 1500 మధ్య సంపాదించుకుంటుంటాను. అది నాకు, నా గళ్ ఫ్రెండ్(భార్యను ఆయన అలా అన్నారు)కు సరిపోతుంది’ అని నవ్వుతూ చెప్పాడు. భార్యను మగాడి సేవకురాలిగా చూడడకూడదన్నది ఆయన ఉద్దేశ్యం. తన భార్య తనకన్నా ఏమీ తీసిపోదని, కొన్ని సందర్భాల్లో తనకన్నా తెలివిగా వ్యవహరిస్తుంటుందని ఆయన చెప్పుకొచ్చాడు. తన ఓ కుమారుడు ఇంటి అద్దె కట్టే విషయంలో సాయపడుతుంటాడని చెప్పాడు. ‘మా పిల్లలు వారి జీవితాన్ని గడుపుతున్నారు. మేమేమి వారిపై ఆధారపడిలేము. మేమంతా సంతోషంగానే ఉన్నాము’ అని చెప్పుకొచ్చాడు.
This morning, on my way to work, stranded by an Uber auto driver in the middle of the highway, I must have had a worried expression on my face which made an old man driving a rickshaw stop and ask me where I wanted to go. Skeptical at first, I told him I needed to get to the other end of town to my office and that I was already late. He said, “Please come in Ma’m, you can pay what you want” in impeccable English. Taken aback with such kind behaviour, I said ok and what followed was a very enriching 45 minutes. Of course, as a Researcher, I couldn’t contain my curiosity and asked him how he spoke such good English to which he said he was an English lecturer and has done his M.A and M.Ed!
He predicted my next question and asked me himself, “So you’re going to ask me why I am driving an auto right?” I said, absolutely, please tell me. He said he is 74 years old now and has been driving a rickshaw for 14 years. Previously he was an English lecturer at a college in Mumbai because he did not get any jobs in Karnataka. The only question he was asked was, “What is your caste?” and when he said his name was Mr. Pataabi Raman, they said, “We will let you know.” Fed up, he moved to Mumbai to look for a job and was welcomed and given a job in the reputed Powai college where he worked for 20 years. At 60, he retired and came back to Karnataka.
“Teachers do not get paid well. The maximum you can earn is 10-15,000/- and since it was a private institution, I don’t have pension. By driving a rickshaw I get at least 700-1500/- a day which enough for me and my girlfriend”, he laughed. When I laughed too he said, “She is my wife but I call her my girlfriend because you must always treat them as equal. The minute you say wife, husbands think she’s a slave who must serve you but she is in no way inferior to me, in fact she is superior to me sometimes. She is 72 and takes care of the house while I work for 9-10 hours a day. We live in a 1 BHK in Kadugodi where my son helps pay the rent of 12,000/- but beyond that, we are not dependent on our children. They live their life and we live ours happily. Now I am the Raja of my road, I can take my auto out any time I want and work when I want.” Not one complaint about life. Not one regret. So much to learn from these hidden heroes. My Thursday morning was made. At Jumbotail, where I work, we as a team are always curious about the Next billion users and their stories. This is just one of them. #motivationoftheday #storiesofindia #designresearch #workdiaries #inspiration
నాలుగు రోజుల క్రితం నికితా అయ్యర్ పెట్టిన ఈ పోస్ట్ కు 72వేల లైకులు వచ్చాయి. కాగా 2300 మంది షేర్ చేశారు. కామెంట్ సెక్షన్ లో ఒకరు దీనికి ‘ప్రేరణ ఇచ్చే కథనం’(ఇన్సిపిరేషనల్ స్టోరీ) అని రాశారు.
- Advertisement -