న్యూస్ డెస్క్: అమెరికాకు చెందిన ఎలిజబెత్ ఆండర్సన్ సియర్రాకు ఇద్దరు పిల్లలు. అయితే ఆమె నెలలు నిండకముందే పుట్టిన వేలాది శివువులకు చనుబాలిచ్చారు.
హైపర్‌లాక్టేషన్ సిండ్రోమ్ అనే వ్యాధితో ఎలిజబెత్ బాధపడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా ఆమె రొమ్ములు పాలతో నిండిపోతుంటాయి. ఆరెగాన్‌లోని అలోహాకు చెందిన ఎలిజబెత్ ప్రపంచంలోనే అత్యధిక చనుబానులిచ్చిన మహిళగా ప్రపంచ రికార్డును సాధించారు. 2015 ఫిబ్రవరి 20 నుంచి ఆమె ఒక తల్లిపాలనిధికి చనుబాలను విరాళంగా అందచేస్తున్నారు. ఆమె వీడియోను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా లక్షలాదిమంది దీన్ని వీక్షించారు.
గత తొమ్మిదేళ్లుగా తాను మొత్తం 3,50,000 ఔన్సుల చనుపాలను విరాళంగా అందచేసి ఉంటానని, అయితే తన పరిస్థితి శత్రువుకు కూడా రాకూదని కోరుకుంటున్నానని ఎలిజబెత్ చెప్పారు. ఇది నవ్వులాటకాదని ఆమె అన్నారు. తన చనుబాలతో ఎంతమంది శిశువులు పాలు తాగారో తెలుసుకోవడం అసాధ్యమని ఆ వీడియోలో ఆమె అన్నారు.
చనుబాలతో నిండిపోయిన సీసాలను చూపిస్తూ కొద్ది నిమిషాల్లోనే తనలో పాలు ఉత్పత్తి అవుతుంటాయని ఆమె తెలిపారు. స్థానిక కుటుంబాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా తన పాలను తాగిన శిశువులు ఉంటారని ఆమె తెలిపారు.
Elisabeth's body can't stop making milk.
She's been constantly donating her breastmilk to babies who need it most. pic.twitter.com/N7BCcaNOO7
— Guinness World Records (@GWR) July 14, 2023