- Advertisement -
న్యూయార్క్: ఇటీవల కత్తిపోట్లకు గురైన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీకి సంఘీభావంగా శుక్రవారం న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీలో సాహితీవేత్తలు, ప్రచురణకర్తలు, రచయితలు సమావేశమై రష్దీ రచనలను పఠించారు. రష్దీ అధ్యక్షుడిగా ఉన్న సాహితీ, భావ వ్యక్తీకరణ హక్కు కోసం పోరాడే సంస్థ పెన్ అమెరికా సభ్యులు, రష్దీ ప్రచురణకర్త పెంగ్విన్ రాండమ్ హౌస్, ది న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ, హౌస్ ఆఫ్ స్పీక్‌ఈజీ సభ్యులు సల్మాన్ రష్దీకి మద్దతుగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. రచయితలు టీనా బ్రౌన్, కిరణ్ దేశాయ్, ఆసిఫ్ మాండ్వి, రెజినాల్డ్ డ్వేన్ ఎబట్స్ తదితర రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలు ఈ సమావేశంలో పాల్గొని75 ఏళ్ల బుకర్ ప్రైజ్ విజేత అయిన రష్దీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
- Advertisement -