Monday, December 23, 2024

గాంధీభవన్‌లో 8 కమిటీల సమావేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఏఐసిసి నియమించిన ఎనిమిది కమిటీలు గురువారం గాంధీభవన్‌లో సమావేశమయ్యాయి. ఆ కమిటీలకు కేటాయించిన పనులను ఇప్పటికే ఈ ఎనిమిది కమిటీలు పూర్తి చేయడానికి తమవంతు పాత్రను పోషించ నున్నాయి. మరోవైపు సీడబ్ల్యూసీ సమావేశాలు, విజయభేరి బహిరంగసభ కోసం ఏర్పడిన ఆరు కమిటీలు హోటల్ తాజ్ కృష్ణలో భేటీ అయ్యాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్‌రావు ఠాక్రే ఈ కమిటీల చైర్మన్లతో సుదీర్ఘంగా చర్చించి కార్యక్రమం గురించి దిశా నిర్దేశం చేశారు. తమకు అప్పజెప్పిన బాధ్యతలను నిర్వర్తించేందుకు ఆయా కమిటీలు పకడ్భందీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News