Saturday, November 23, 2024

ఆ ముగ్గురి నిర్ణయం తర్వాతే..

- Advertisement -
- Advertisement -

Meeting of Congress party chief was held at Gandhi Bhavan

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు…

మన తెలంగాణ/హైదరాబాద్ : హజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎంపికపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముగ్గురు నేతల అభిప్రాయం తర్వాత ఎఐసిసికి నివేదిక పంపాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం సోమవారం నాడు గాంధీభవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎంపిక విషయమై కాంగ్రెస్ నేతలు చర్చించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబుల అభిప్రాయాలు తీసుకోవాలని ఈ సమావేశలో నేతలు అభిప్రాయపడ్డారు. ఈ ముగ్గురి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో నేతల అభిప్రాయాలు తీసుకునేందుకు గాను సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహలతో కాంగ్రెస్ పార్టీ కమిటీని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 10వ తేదీలోపుగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ ముఖ్య నేతల్లో మెజార్టీ నేతలు మాజీ మంత్రి కొండా సురేఖ అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపారని సమాచారం. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముగ్గురు ముఖ్య నేతలు శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ అభిప్రాయం తీసుకోవాలని ఈ సమావేశలో నిర్ణయం తీసుకున్నారు. ఈ ముగ్గురి నిర్ణయం తార్వతే ఎఐసిసికి నివేదిక పంపాలని సమావేశంలో నిర్ణయించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News