Friday, December 20, 2024

ఇండోర్‌లో ఇండియా బహిరంగ సభ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : త్వరలోనే సీట్ల సర్దుబాట్లపై చర్చించాలని , మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అక్టోబర్ మొదటివారంలో సంయుక్త బహిరంగ సభ నిర్వహించాలని ప్రతిపక్ష ఇండియా కూటమి నిర్ణయించింది. ఎన్‌సిపి నేత శరద్ పవార్‌కు చెందిన ఇక్కడి నివాసంలో బుధవారం ఇండియా కూటమి సమావేశం జరిగింది. ఈ దఫా భేటికి 12 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఇండియా కూటమి సమన్వయ కమిటీ తొలి సమావేశం ఇప్పుడు జరిగిందని విపక్ష నేతలు విలేకరులకు తెలిపారు. ముంబైలో ఇండియా భేటీ తరువాత ఇప్పుడు సమన్వయ కమిటీ సమావేశాలు జరిగినట్లు వెల్లడైంది. ఈ సమావేశంలో శరద్ పవార్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, సిపిఐ నేత డి రాజా,

సమాజ్‌వాది పార్టీ నేత జావెద్ అలీఖాన్, డిఎంకె నేత టిఆర్ బాలు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆప్ ఎంపి రాఘవ చద్ధా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా , మెహబూబా ముఫ్తీ ఇతరులు పాల్గొన్నారు. ఇండోర్‌లోతొలి బహిరంగ సభ ఉంటుంది. మధ్యప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వ హయాంలో పెరిగే ధరలు, అవినీతి, నిరుద్యోగం ఇతర అంశాలను ఎండగడుతూ పలువురు నేతలు ఈ సభలో మాట్లాడుతారని వెల్లడించారు. సీట్ల సర్దుబాట్లు అత్యంత కీలకమైన విషయం , దీనిపై ఎటువంటి నిర్ణయం ఇంకా కుదరలేదు. అయితే సాధ్యమైనంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని కమిటీ సమావేశాల్లో నిర్ణయించారు. ఇండియా కూటమి తరఫున దేశంలో కులాల వారి జనగణన విషయాన్ని ప్రధానంగా చేపట్టాలని నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News