Tuesday, January 21, 2025

నేడు కాంగ్రెస్ నేతలతో సమావేశం :పిసిసి

- Advertisement -
- Advertisement -

Meeting with Congress leaders today

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షలకు పైగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాల నమోదు అయ్యాయని పిసిసి కార్యనిర్వహక అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ రోజుతో సభ్యత్వ నమోదు ముగిసిందన్నారు. ఇప్పటి వరకు సభ్యత్వాలు తీసుకున్న వారికి ఇన్సూరెన్స్ కట్టడం జరిగిందన్నారు. శనివారం ఉదయం సీనియర్ నేతలు, డిసిసి, అనుబంధ సంఘాల నేతలతో సమావేశం ఉంటుందన్నారు. సభ్యత్వాలు తీసుకున్న వారి కోసం గాంధీభవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. పవన్, మల్లారెడ్డి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అందేలా చూస్తారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికీ ఎలాంటి ప్రమాదం జరిగిన క్లెయిమ్స్ అయ్యేలా పర్యవేక్షిస్తారు.

రెండు రోజుల పాటు రాహుల్ పర్యటన..

జాతీయ నాయకుడు రాహుల్‌గాంధీ రెండు రోజులు పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. మే మొదటి వారంలో రానున్నారని తెలిపారు. శనివారం ఎఐసిసి రాహుల్ పర్యటన తేదీలను ప్రకటిస్తుంది. రాహుల్ మొదటి రోజు వరంగల్ సభలో పాల్గొంటారు రెండో రోజు హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతలతో సమావేశంలో పాల్గొంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News