Saturday, November 16, 2024

ట్రాఫిక్‌పై మాల్స్, పబ్‌ల యాజమాన్యాలతో సమావేశం

- Advertisement -
- Advertisement -

నిర్వహించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశం

మనతెలంగాణ, సిటిబ్యూరోః పబ్బులు, మాల్స్‌లో పార్కింగ్ కోసం స్థలం లేకపోతే అద్దెకు తీసుకుని పార్కింగ్‌ను ఏర్పాటు చేయాలని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి డివి శ్రీనివాస్ అన్నారు. పబ్బులు, మాల్స్ యాజమాన్యాలతో మంగళవారం ఆయన గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సమావేశమయ్యారు. సమావేశంలో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై చర్చించారు. ఈ సందర్భంగా డిసిపి శ్రీనివాస్ మాట్లాడుతూ మాల్స్, పబ్బులు ముందు ట్రాఫిక్ జాం కాకుండా చూడాలని కోరారు.

పబ్బులు,మాల్స్ వద్ద అలైటింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని, కస్టమర్ల పికప్, డ్రాప్ కోసం వాడాలని కోరారు. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మాల్స్, పబ్బుల మేనేజ్‌మెంట్లు పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. వాటికి పార్కింగ్ ప్రాంతం లేకపోతే అద్దెకు తీసుకుని వాటిల్లో వాహనాలను నిలపాలని అన్నారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సెక్యూరిటీ గార్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. పబ్బులు, మాల్స్‌లో ఎంట్రీ, ఎగ్జిట్ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. పార్కింగ్ కోసం తగినంత సిబ్బందిని నియమించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఎడిసిపి శ్రీనివాస్‌రెడ్డి, ఎడిసిపి వేణుగోపాల్ రెడ్డి, ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, మాల్స్, పబ్బుల మేనేజ్‌మెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News