Monday, November 25, 2024

గిరిజనోత్సవంపై గిరిజన గ్రామాల్లో సభలు నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించనున్న తెలంగాణ గిరిజనోత్సవంపై గ్రామాల్లో సభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. 18వ తేదీ మంచినీళ్ల పండుగ కార్యక్రమాల నిర్వహణపై శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించాలని చెప్పారు.

గిరిజనుల చిరకాల వాంఛను నెరవేరుస్తూ ప్రభుత్వం తండాలను, గూడాలను గ్రామ పంచాయతీ హోదా కల్పించిన తీరు తదుపరి పరిపాలన ప్రజలకు చేరువ చేసిన విధానాన్ని తెలియ చేయాలని చెప్పారు. విద్య, ఉద్యోగాల్లో ఎస్టీలకు రిజర్వేషన్స్ పది శాతం పెంచిన అంశాలని తెలపాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి ఉచితంగా నల్లాలు బిగించి ఉచితంగా స్వచ్ఛమైన సురక్షితమైన మంచినీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.

తాగునీటి కష్టాలు సంపూర్ణంగా తీరిపోయి, మహిళలు సంతోషిస్తున్న విధానాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలన్నారు. ఈ కార్యక్రమంలో సెర్ఫ్ ఉద్యోగులందరిని భాగస్వామ్యం చేయాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News