Monday, December 23, 2024

అంతర్జాతీయ క్రికెట్‌కు మెగ్ లానింగ్ గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా స్టార్ మహిళా క్రికెటర్ మెగ్ లానింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ప్రపంచ మహిళా క్రికెట్‌లోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా, బ్యాటర్‌గా లానింగ్ పేరు తెచ్చుకుంది. 31 ఏళ్ల తన కెరీర్‌లో ఏడు ప్రపంచకప్‌లను సాధించింది. ఇందులో ఆమె సారథ్యంలో సాధించిన ప్రపంచకప్‌లే ఐదు ఉండడం మరో విశేషం. 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో మెగ్ లానింగ్ ఎంతో రికార్డులను సొంతం చేసుకుంది. లానింగ్ ఆరు టెస్టులు ఆడి 345 పరుగులు చేసింది. అంతేగాక 103 ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించి 4602 పరుగులు, 132 టి20 మ్యాచుల్లో 3405 పరుగులు సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News