మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ, మైత్రీ మూవీ మేకర్స్‌ల క్రేజీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘మెగా 154’ థియేట్రికల్ విడుదల తేదీ ఖరారైంది. ‘వచ్చే ఏడాది సంక్రాంతికి ‘మెగా 154’ థియేటర్‌లో పూనకాలు సృష్టించడానికి సిద్ధమైంది… కలుద్దాం సంక్రాంతికి’ అని పోస్టర్ ద్వారా నిర్మాతలు మెగా రిలీజ్‌ని ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి చేతిలో లంగరుని పట్టుకొని ఉండగా బ్యాక్‌గ్రౌండ్‌లో సముద్రం, పడవలు కనిపించడం మెగా వైబ్రెంట్‌గా వుంది. ఈ చిత్రం టైటిల్, టీజర్‌ను త్వరలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం 40 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ వచ్చే నెల నుండి ప్రారంభమవుతుంది. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
MEGA 154 to Release on Sankranti 2023