Monday, January 20, 2025

#మెగా156 చిత్రాన్ని ప్రకటించిన సుస్మిత కొణిదెల..

- Advertisement -
- Advertisement -

భోళా శంకర్ మూవీతో నిరాశ పర్చిన మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చిత్రాలను పక్కన పెట్టి కొత్త కథలతో అలరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మంగళవారం చిరు పుట్టిన రోజు సందర్భంగా రెండు కొత్త ప్రాజెక్టులను ప్రకటించారు.ఇందులో ఒక మూవీని చిరు తన కూతురు సుస్మిత బ్యానర్ లో చేస్తుండగా, మరోకటి ‘భింబిసార’ దర్శకుడు తెరకెక్కించబోయే యూనివర్సల్ చిత్రంలో నటించనున్నారు.

తాజాగా ఈ రెండు చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ ను వెల్లడిస్తూ మేకర్స్, చిరుకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. సుస్మిత కొణిదెల బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ లో చిరు 156 రూపొందనుండగా, 157వ చిత్రాన్ని యూవి క్రియేషన్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. త్వరలో ఈ రెండు చిత్రాలకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News