Friday, December 20, 2024

‘మెగా156’ షూట్ షురూ

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి మెగా ఫాంటసీ అడ్వెంచర్ ‘మెగా156’ దసరాకి గ్రాండ్‌గా లాంచ్ అవ్వడంతో పాటు రికార్డింగ్ సెషన్స్ కూడా ప్రారంభమయ్యాయి. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించారు. క్లాప్‌బోర్డ్‌ను దర్శకుడు మారుతి డిజైన్ చేశారు.

ఇది సీన్ నంబర్ 9ని టీం చిత్రీకరిస్తుందని సూచిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో దట్టమైన అడవిని గమనించవచ్చు. మొదటి షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొంటారు. విక్రమ్, వంశీ, ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటి వరకు చిరంజీవి కెరీర్‌లో భారీ బడ్జెట్ చిత్రంగా నిలుస్తోంది. ఈ సినిమాకు ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News